- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM విజయ్‌కు ఫోన్ చేసిన వైఎస్ జగన్
తమిళనాడు CM విజయ్‌కు ఫోన్ చేసిన వైఎస్ జగన్..శుభాకాంక్షలు చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన విజయ్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా కొత్త సీఎం విజయ్ కి శుభాకాంక్షలు తెలిపారు. టీవీకే పార్టీ ఘన విజయం సాధించి... విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సమర్థవంతమైన, పారదర్శకమైన ప్రజాపాలన విజయ్ అందిస్తారని ఆశ భావం వ్యక్తం చేశారు జగన్.
విజయ్ నాయకత్వంపై ప్రజలకు ఎంతో విశ్వాసం
విజయ్ నాయకత్వంపై తమిళనాడు ప్రజలు ఎంతో విశ్వాసం ఉంచారని ప్రశంసించారు. దాన్ని నిలబెట్టుకుంటూ వారి ఆశలను నెరవేర్చాలని వైయస్ జగన్మోహన్ రెడ్డి సూచనలను చేశారు. తమిళనాడు ప్రజలకు సరైన న్యాయం చేస్తే.. సీఎం విజయ్ కి తిరుగు ఉండదని కుండబద్దలు కొట్టి చెప్పారు. ఇది ఇలా ఉండగా, వందకు పైగా సీట్లు సాధించి తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించాడు విజయ్. పార్టీ పెట్టిన రెండు సంవత్సరాల్లోనే అధికారంలోకి వచ్చాడు. కాంగ్రెస్ లాంటి ఇతర పార్టీలతో కలిసి తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు.






