- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజలను మోసం చేసి, ద్రోహం చేసినందుకే వెన్నుపోటు దినం: జగన్
చంద్రబాబు ప్రజలను మోసం చేసి, ద్రోహం చేసినందుకే నేడు వెన్నుపోటు దినంగా ప్రకటించామని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబు ప్రజలను మోసం చేసి, ద్రోహం చేసినందుకే నేడు వెన్నుపోటు దినంగా ప్రకటించామని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సరిగ్గా ఏడాది క్రితం జూన్ 4న చంద్రబాబు ఎన్నో వాగ్దానాలతో అధికారంలోకి వచ్చారని చెప్పారు. కానీ ఒక్కటి కూడా అమలు చేయలేదని చెప్పారు. బదులుగా ఆయన తనను నమ్మిన ప్రజలకే ద్రోహం చేశారని, తప్పుడు ప్రకటనలు మరియు హామీలు ఇచ్చి అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచి రాష్ట్రాన్ని నిరాశలోకి నెట్టివేశారని అభిప్రాయపడ్డారు.
అందుకే నేడు వెన్నుపోటు దినోత్సవానికి పిలుపునిచ్చామని తెలిపారు. ఈ రోజు అన్ని వర్గాల ప్రజలు భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి తమ వేదన మరియు కోపాన్ని వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇది కేవలం నిరసన మాత్రమే కాదని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అబద్దాలు మరియు మోసాలను సహించరు అనే సందేశం అని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రజలు భారీగా హాజరవ్వడం మోసపోయిన బాధ, నిరాశను తెలుపుతుందని పేర్కొన్నారు. ఈ నిజాన్ని ప్రజలతో పాటు వినిపించడానికి నిలబడిన ప్రతి వైసీపీ నాయకుడు, కార్యకర్త మరియు సామాన్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. న్యాయం, గౌరవం, ప్రజల హక్కుల కోసం ఈ పోరాటం మరింత బలంగా సాగుతుందని అన్నారు.






