- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ap: వల్లభనేని వంశీతో వైఎస్ జగన్ ములాఖత్
వల్లభనేని వంశీతో వైఎస్ జగన్ ములాఖత్ కానన్నారు..

దిశ, వెబ్ డెస్క్: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Former Gannavaram MLA Vallabhaneni Vamsi) అరెస్ట్ అయి విజయవాడ సబ్ జైలు(Vijayawada Sub Jail)లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే వంశీని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కలవనున్నారు. ఈ మేరకు మంగళవారం ములాఖత్ కానున్నారు. ఉదయం తాడేపల్లి ఇంటి నుంచి బయల్దేరి 10.30 గంటలకు జైలులో వంశీతో ములాఖత్ అవుతారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు కూడా సబ్ జైలు వరకూ ఆయన వెంట వెళ్లనున్నారు. అనంతరం వంశీతో జగన్ భేటీ అయి ధైర్యం చెప్పనున్నారు. ఆ తర్వాత వంశీ అరెస్ట్‌పై జైలు బయట స్పందించనున్నారు.
కాగా వ్యక్తిని కిడ్నాప్ చేశారనే ఆరోపణలతో వల్లభనేని వంశీని విజయవాడ కృష్ణలంక పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు రిమాండ్ విధించడంతో విజయవాడ సబ్ జైలుకు తరలించారు. అయితే తనకు బెయిల్ ఇవ్వాలని విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో వంశీ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు మాత్రం వంశీకి బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరారు. అంతేకాదు మరింత విచారణ జరగాల్సినందున వంశీని కస్టడీకి ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు మరో రెండు కేసుల్లో పీటీ వారెంట్లు రెడీ చేస్తున్నారు. ఇంకో కేసులో నిందితుడిగా చేర్చనున్నారు. ఈ నేపథ్యంలో వంశీతో జగన్ ములాఖత్ చర్చనీయాంశంగా మారింది.






