- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తీవ్ర అన్యాయం జరుగుతోంది.. వాదనలు వినిపించండి: చంద్రబాబుకు జగన్ లేఖ
కృష్ణా జలాల పంచాయితీపై సీఎం చంద్రబబుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు..

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap), తెలంగాణ(Telangana) మధ్య కృష్ణా నదీ జలాల(Krishna River) పంపిణీ పంచాయితీ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరుగుతోందని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former CM Jagan Mohan Reddy) ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు(CM Chandrababu)కు లేఖ రాశారు. రాబోయే విచారణలో కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్- II ముందు ఏపీ వాదనను బలంగా వినిపించాలని కోరారు. కృష్ణా నదిలో 763 TMCల నీటిని తమకు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోందని, కేఆర్ఎంబీ అంగీకరిస్తే రాష్ట్రం తీవ్ర అన్యాయానికి గురవుతుందని తెలిపారు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు KWDT - II ముందు తన తుది వాదనలను సమర్పించి అన్యాయమైన పునర్విభజనను నిరోధించాలని లేఖలో పేర్కొన్నారు.
రాయలసీమ ప్రాజెక్టుల పట్ల టీడీపీ వైఖరిని జగన్ లేఖలో ఎత్తి చూపారు. 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా చంద్రబాబు పని చేశారని, ఆసయంలోనే ఆల్మట్టి ఆనకట్ట ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.25 మీటర్లకు పెంచే పనులు ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. ఈ పరిణామం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హక్కులను తీవ్రంగా దెబ్బతీస్తుందని అప్పటి ప్రతి పక్ష నాయకులు ఆందోళన వ్యక్తం చేశారని, అయినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోదని తెలిపారు. టీడీపీ ప్రభుత్వ నిజాయితీ లేని వైఖరి కారణంగానే, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కర్ణాటకకు ఆల్మట్టి ఆనకట్ట ఎత్తును పెంచడానికి అనుమతి ఇచ్చిందన్నారు. 2014లో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం కృష్ణా నదీ జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణకు వదులుకుందని లేఖలో పేర్కొన్నారు.
మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ ఈ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది, దీనిలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవాలి. ఈ కీలక సమయంలో టిడిపి సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్రం పట్ల నిబద్ధతను చూపించాలి. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను కాపాడాలి. బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 512 టిఎంసి నికర నీటిలో ఒక టిఎంసి అయినా కోల్పోయే పరిస్థితి తలెత్తినా, దానికి టిడిపి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.’’ అని లేఖలో జగన్ డిమాండ్ చేశారు.






