చంద్రబాబు.. నా డిమాండ్ ఇదే: జగన్ ట్వీట్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-12 11:37:57  IST  )

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువత పరిస్థితి దుర్భరంగా మారిందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు...

చంద్రబాబు.. నా డిమాండ్ ఇదే: జగన్ ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: యువతకు సీఎం చంద్రబాబు(Cm Chandrababu) వెన్నుపోటు పొడిచారని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy) అన్నారు. స్వామి వివేకానంద జయంతి(Swamy Vivekananda Reddy Jayanthi) సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. వివేకాంద సూక్తులు చెబుతూ సీఎం చంద్రబాబుపై ఆయన విమర్శలు కురిపించారు. యువతకు రూ. 3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటివరకూ రెండు విడతలు చెల్లించాలని గుర్తు చేశారు. ప్రభుత్వం మోసం చేయడం వల్ల యువత తమ లక్ష్యాన్ని చేరుకోలేకపోతోందన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్(Fee Reimbursement), విద్యాదీవెన బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల ఆశయాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. యువత ఏకాగ్రత, లక్ష్యంతో పని చేస్తే దేశం బలపడుతుందని స్వామి వివేక నమ్మారని జగన్ తెలిపారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో యువత పరిస్థితి దుర్భంగా మారిందని విమర్శించారు. ఇకనైనా ప్రభుత్వం మేలుకుని యువత లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలని జగన్ డిమాండ్ చేశారు.

Next Story