- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇవాళ గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో YS జగన్ భేటీ.. కోటి సంతకాల ప్రతుల అందజేత!
రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ (YCP) చేపట్టిన ‘కోటి సంతకాల’ ఉద్యమం ముగిసింది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ (YCP) చేపట్టిన ‘కోటి సంతకాల’ ఉద్యమం ముగిసింది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ (Governor Justice S. Abdul Nazeer)తో మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) భేటీ కానున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన ఒక కోటికిపైగా సంతకాలతో కూడిన పత్రాలను గవర్నర్‌కు సమర్పించనున్నారు.
కాగా, చంద్రబాబు (Chandrababu) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న 10 మెడికల్ కాలేజీలను పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ (PPP) మోడల్‌లో ప్రైవేటు సంస్థలకు అప్పగించే నిర్ణయం తీసుకుంది. దీంతో వైఎస్సార్‌సీపీ ప్రైవేటీకరణగా అభివర్ణిస్తూ, పేద విద్యార్థులకు మెడికల్ విద్య అందుబాటులో ఉండదని ఆరోపిస్తుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత చికిత్స ప్రభావితమవుతుందని విమర్శిస్తోంది. ఈ విషయంలో కోటి సంతకాలు సేకరించి ప్రజల గొంతుకను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్‌కు అందించి, ఆ తర్వాత కోర్టులకు తీసుకెళ్తామని జగన్ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు, ప్రభుత్వం PPP మోడల్‌ను సమర్ధిస్తూ, ఇది ప్రైవేటీకరణ కాదని, వేగవంతమైన అభివృద్ధి, మెరుగైన సౌకర్యాలు, ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యమని చెబుతోంది. ఈ వివాదం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.






