- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల లడ్డూ కల్తీపై జగన్ కీలక వ్యాఖ్యలు
తిరుమల లడ్డూ కల్తీపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు..

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ కల్తీ(Tirumala laddu adulteration) ఘటనపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former CM Jagan Mohan Reddy) స్పందించారు. అన్ని టెస్టులు పూర్తయ్యేకే నెయ్యి సరఫరా జరుగుతుందని ఆయన తెలిపారు. తమ హయాంలో 18సార్లు, 2014-19లో చంద్రబాబు 15సార్లు నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపామని గుర్తుచేశారు. తిరుమల లడ్డూ కల్తీ జరిగిందని చంద్రబాబు మాత్రమే దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. దేవుడంటే భక్తి, భయంలేని చంద్రబాబు లడ్డూలో కల్తీ జరిగిందని మాట్లాడటం విడ్డూరమని విమర్శించారు. కల్తీ నెయ్యి ఆరోపణలు ఉన్న ట్యాంకర్లు ప్రసాదం పోటులోకి వెళ్లి ఉంటే ఆధారాలు చూపించాలని జగన్ డిమాండ్ చేశారు.
టీటీడీ(TTD)లోకి వెళ్లే ప్రతి ట్యాంకర్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి పంపిస్తారని, Nabl తర్వాత కూడా టీటీడీ ల్యాబ్‌లో టెస్టు కూడా పాస్ కావాలని చెప్పారు. Nabl ల్యాబ్, టీటీడీ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే ట్యాంకర్ లోపలికి వెళ్తుందన్నారు. ఇది తిరుమలలో రొటీన్‌గా జరుతుందన్నారు. 2014-19 మధ్య కిలో నెయ్యిని రూ. 276 నుంచి రూ. 318 వరకు కొంటున్నారని, ఇంత తక్కువకు కొన్నారంటే అది కల్తీ నెయ్యేనా..? అని ప్రశ్నించారు. ఏ కంపెనీ అయినా సరే నిబంధనల ప్రకారం తనిఖీలు జరుగుతాయని తెలిపారు. టీడీపీ హయాంలో జరిగిన అవకతవకలకు బాధ్యులెవరు అని నిలదీశారు. ఒకరిని ఇరికించే ప్రయత్నంలో చాలా తప్పులు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు.






