ముద్రగడ ఆరోగ్యంపై వైయస్ జగన్ ఆరా

by velandi.Saikiran |

కాపు ఉద్యమ నేత, వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం అనారోగ్యం పాలైన సంగతి తెలిసిందే. అయితే ముద్రగడ

ముద్రగడ ఆరోగ్యంపై వైయస్ జగన్ ఆరా
X
  • ముద్రగడ ఆరోగ్యంపై వైయస్ జగన్ ఆరా
  • కాకినాడ నుంచి హైదరాబాద్ కు తరలించాలని సూచన


దిశ, వెబ్ డెస్క్ : కాపు ఉద్యమ నేత, వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం అనారోగ్యం పాలైన సంగతి తెలిసిందే. అయితే ముద్రగడ అనారోగ్యం పాలు కావడంతో... వైయస్ జగన్మోహన్ రెడ్డి.. ఆయన ఆరోగ్యం పై తీశారు. ఇందులో భాగంగానే... ముద్రగడ కుమారుడు గిరి బాబుకు ఫోన్ కూడా చేశారు వైయస్ జగన్. ఈ సందర్భంగా ముద్రగడ ఆరోగ్యం పై వివరాలు తెలుసుకున్నారు.

అత్యవసరం అయితే కాకినాడ నుంచి హైదరాబాద్ కు ఎయిర్ లిఫ్ట్ చేయాలని కూడా సూచనలు చేశారు జగన్మోహన్ రెడ్డి. ఎయిర్ లిఫ్ట్ కు తాను సహకారం అందిస్తానని కూడా హామీ ఇచ్చారు. అస్వస్థత నుంచి ఇప్పుడిప్పుడే ముద్రగడ కోలుకుంటున్నారట. ఆయనను వైసీపీ నేతలు వంగా గీత, జంగి రెడ్డి లాంటి నేతలు అందరూ పరామర్శించారు.

ఇది ఇలా ఉండగా.. గత కొన్ని రోజుల నుంచి శ్వాస సంబంధిత సమస్యతో ముద్రగడ పద్మనాభం బాధపడుతున్నారు. అయితే శనివారం రోజున ఆ సమస్య పెరిగిపోవడంతో వెంటనే కాకినాడ అహోబిలం ఆసుపత్రికి ముద్రగడ పద్మనాభంను తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం స్థానికంగా ఉన్న మెడికవర్ ఆసుపత్రికి రాత్రి 10 గంటల సమయంలో తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెబుతున్నారు.

Next Story