- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూటు మార్చుకున్న జగన్..
వైసీపీ పోలీసులకు ఒక రూట్ మ్యాప్ ను ఇవ్వగా.. ప్రజల భద్రత దృష్ట్యా పోలీసులు వైసీపీ టీమ్ కు మరో రూట్ మ్యాప్ ను అందించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఇబ్రహీంపట్నంలో ధ్వంసమైన మాజీ మంత్రి జోగి రమేశ్ నివాసాన్ని పరిశీలించేందుకు వైఎస్ జగన్ తాడేపల్లి నుంచి కాసేపట్లో బయల్దేరనున్నారు. ఈ క్రమంలో వైసీపీ పోలీసులకు ఒక రూట్ మ్యాప్ ను ఇవ్వగా.. ప్రజల భద్రత దృష్ట్యా పోలీసులు వైసీపీ టీమ్ కు మరో రూట్ మ్యాప్ ను అందించారు. తొలుత పోలీసుల రూట్ మ్యాప్ ఫాలో కాబోమన్న వైసీపీ.. చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకుంది. పోలీసులు సూచించిన మార్గంలోనే జగన్ ఇబ్రహీంపట్నంకు వెళ్లనున్నారు.
తాడేపల్లి నుంచి మంగళగిరి బైపాస్, కాజ వెస్ట్ బైపాస్, గుంటుపల్లి మీదుగా ఇబ్రహీంపట్నంకు చేరుకోనున్నారు. జోగిరమేశ్, ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించి, ధ్వంసమైన ఇంటిని పరిశీలించిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లికి తిరుగు పయనమవ్వనున్నారు. మరోవైపు వైసీపీ మాజీ మంత్రి రోజా జోగి రమేశ్ నివాసానికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు.






