- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైఎస్ జగన్ ఇబ్రహీంపట్నం పర్యటనపై హైటెన్షన్.. పోలీసుల నోటీసులు బేఖాతరు?
వైఎస్ జగన్ ఇబ్రహీంపట్నం పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. పోలీసుల ఆంక్షలను బేఖాతరు చేసిన క్రమంలో.. ఎటువైపు నుంచి వెళ్తారన్నదానిపై స్పష్టత లేదు.

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ఇబ్రహీంపట్నంలోని వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడులు చేసి, పెట్రోల్ బాటిళ్లు విసిరి నిప్పు పెట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నేడు జోగి రమేశ్ ఇంటికి వెళ్లి పరామర్శించనున్నారు. ధ్వంసమైన ఆయన ఇంటిని పరిశీలించనున్నారు. ఈ మధ్యకాలంలో జరిగిన ఘటనల దృష్ట్యా విజయవాడ పోలీసులు జగన్ పర్యటనపై ఆంక్షలు విధించారు. జగన్ ఇబ్రహీంపట్నం వెళ్లే సమయంలో భారీగా ప్రజలు గుమిగూడే అవకాశం ఉండటంతో.. ఆయన పర్యటనపై హైటెన్షన్ నెలకొంది. ఈ క్రమంలోనే ఆయనకు పోలీసులు పలు సూచనలు చేశారు.
తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి కృష్ణా - గుంటూరు జిల్లాలను కలిపే వారధి మీదుగా విజయవాడలోకి ఎంటరై.. గొల్లపూడి మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్లాలని వైసీపీ ప్లాన్ చేసింది. కానీ.. పోలీసులు ట్రాఫిక్ రద్దీ, మొన్న గుంటూరు పర్యటనలో జనం పోటెత్తిన ఘటనల దృష్ట్యా విజయవాడ వెస్ట్ బైపాస్ నుంచి నల్లకుంట, గుంటుపల్లి, తుమ్మలపాలెంల మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్లాలని రూట్ మ్యాప్ ఇచ్చారు. ప్రజల భద్రతే తమకు ప్రాధాన్యమని విజయవాడ సీపీ నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే కొత్త రూట్ మ్యాప్ ఇచ్చామని తెలిపారు. ముందుగా తాము అనుకున్న రూటులోనే వెళ్తామని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జనసమీకరణ చేయవద్దంటూ వైసీపీ నేతలు నోటీసులు జారీ చేశారు. దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ కు నోటీసులు ఇచ్చారు. జగన్ పర్యటనలో పాల్గొనవద్దని నోటీసుల్లో పేర్కొన్నారు.






