మన రాజకీయ ప్రత్యర్థి జిత్తులమారి నక్క.. మీ మాటే మాకు శాసనం : వర్ల రామయ్య

by Bhoopathi Nagaiah |   (  Updated:2025-05-27 07:30:23  IST  )

గత ప్రభుత్వం మన అధినేత చంద్రబాబుపై దొంగకేసులు పెట్టిందని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య అన్నారు.

మన రాజకీయ ప్రత్యర్థి జిత్తులమారి నక్క.. మీ మాటే మాకు శాసనం : వర్ల రామయ్య
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత ప్రభుత్వం మన అధినేత చంద్రబాబుపై దొంగకేసులు పెట్టిందని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య అన్నారు. మహానాడులో నివేదికను ప్రవేశపెట్టిన ఆయన మాట్లాడుతూ ప్రత్నించే గొంతుకలు గత ప్రభుత్వం నొక్కిందన్నారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన నాటి పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిందన్నారు. ఆ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందన్నారు. చంద్రబాబును అరెస్టు చేస్తే దేశ విదేశాల్లో నిరసనలు పెల్లుబికాయని అన్నారు. జగన్ తలరాతను రాష్ట్ర ప్రజలు తిరగరాశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో ఆత్మస్థైర్యం పెరిగిందన్నారు. సూపర్​సిక్స్​పథకాలు ప్రజలో భరోసా నింపాయని అన్నారు. ఈ పదినెలల పాలనలో ప్రభుత్వం నీడన సుఖ ప్రయాణం సాగిస్తుందన్నారు. ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. మన ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన అన్నారు. మన రాజకీయ ప్రత్యర్థి జిత్తులమారి నక్క అని అన్నారు. వారి పన్నాగాలపై నిరంతరం మన కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చంద్రబాబు మాటే మాకు శాసనం అని తెలిపారు. మీ నాయకత్వమే మాకు శ్రీరామరక్ష అని అన్నారు.

Next Story