- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ సీఎం జగన్‌కు బిగ్ షాక్.. వేసవి తర్వాతే విచారణ
వైఎస్ జగన్ కు ఏపీ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Ap Former Cm Jagan Mohan Reddy)కి బిగ్ షాక్ తగిలింది. తనకు జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ కొనసాగించాలని ఆయన కోరుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు హైకోర్టు(High Court)లో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు జడ్ ప్లస్ భద్రత కల్పించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు. అయితే ఈ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ సాగింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను వేసవి తర్వాతకు వాయిదా వేసింది.
కాగా మాజీ ముఖ్యమంత్రి అయిన తనకున్న ప్రాణహాని దృష్ట్యా సీఆర్పీఎఫ్, ఎన్ఎస్‌జీలతో భద్రత కల్పించాలని ఇప్పటికే కేంద్రప్రభుత్వాన్ని జగన్ మోహన్ రెడ్డి అభ్యర్థించారు. పర్సనల్ సెక్యూరిటీ, జామర్లు, ఇల్లు, కార్యాలయం వద్ద భద్రత, బుల్లెట్ ప్రూఫ్ వాహనం సమకూర్చాలని కోరారు. అయితే కేంద్రం పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇవన్నీ కల్పించారని, ఆ తర్వాత తొలగించారని గుర్తు చేశారు. గతంలో ఉన్న జడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ(Z Plus category security)నే తాను కొనసాగించాలని కోరుతున్నట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు.






