- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
YS Jagan : కేసులకు భయపడేది లేదు : వైఎస్ జగన్
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి(Former CM YS Jagan) మరోసారి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)పై విరుచుకు పడ్డారు.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి(Former CM YS Jagan) మరోసారి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)పై విరుచుకు పడ్డారు. రాష్ట్రంలో మిర్చీకి ధరలేక రైతులు కన్నీళ్ళు పెడుతుంటే కూటమి నాయకులు కూడా పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. తాము స్పందించే వరకు ప్రభుత్వంలో చలనం లేదని.. రైతులకు బాసటగా నిలిస్తే కేసులు పెట్టడం ఏమిటని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, మిర్చి కొనుగోళ్లు ప్రారంభించకపోతే ఊరుకునేది లేదని అన్నారు. ఈ మేరకు జగన్ తన ఎక్స్ ఖాతాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోస్ట్ చేశారు. అయితే గుంటూరు మిర్చి యార్డు(Gunturu Mirchi Yard)లో పంట కొనుగోలు చేయడం లేదంటూ.. పలువురు రైతులు వైసీపీ దృష్టికి తీసుకు వెళ్ళగా.. బుధవారం జగన్ మిర్చి యార్డును సందర్శించారు. అనంతరం రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో భారీగా ప్రజలు, రైతులు రావడంతో మాజీ సీఎం జగన్ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దీంతో పోలీసులు భద్రత కల్పించకపోవడం పై వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్(MLC Election Code) ఉన్నప్పటికీ మిర్చి యార్డులో పర్యటన కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందంటూ.. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే తాను కేసులకు భయపడేది లేదంటూ జగన్ స్పందించారు.






