- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళ పాలిటిక్స్‌లో దళపతి జోరు: ఓ రేంజ్‌లో సెలెబ్రేట్ చేస్తున్న జగన్ ఫ్యాన్స్!
తమిళనాడు రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసేందుకు సిద్ధమైన తమిళగ వెట్రి కళగం అధినేత, దళపతి విజయ్ దూకుడును చూసి ఏపీలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు..

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు రాజకీయాల్లో(Tamilanadu Politics) తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసేందుకు సిద్ధమైన తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, దళపతి విజయ్(Vijay) దూకుడును చూసి ఏపీ(Ap)లోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Ys Jagan Mohan Reddy) అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా విజయ్ రాజకీయ ప్రస్థానానికి జగన్ ఫ్యాన్స్ భారీగా మద్దతు తెలుపుతున్నారు. నిబద్ధతతో కూడిన రాజకీయాలు చేసే యువ నాయకులు రావాల్సిన అవసరం ఉందని, ఆ విషయంలో జగన్, విజయ్ ఇద్దరూ ఒకే బాటలో పయనిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
జగన్, విజయ్ వీడియో మళ్లీ వైరల్
ఇదే క్రమంలో గతంలో చెన్నై వేదికగా జరిగిన ఒక వివాహ వేడుకలో జగన్, విజయ్ పక్కపక్కనే కూర్చుని ముచ్చటించుకున్న వీడియో ఇప్పుడు నెట్టింట మళ్ళీ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఇద్దరు నేతలు ఎంతో ఆప్యాయంగా పలకరించుకోవడం, పరస్పరం చిరునవ్వులు చిందించుకుంటూ మాట్లాడుకోవడం చూస్తుంటే.. వారిద్దరి మధ్య ఉన్న స్నేహం స్పష్టంగా కనిపిస్తోందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ పాత వీడియోను ఇప్పుడు బయటకు తీసి, "భవిష్యత్ ఆశాకిరణాలు ఒకే ఫ్రేమ్‌లో" అంటూ జగన్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు.
తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు ..
విజయ్ తన పొలిటికల్ ఎంట్రీతో తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంటే, అటు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో జగన్ తనదైన శైలిలో పోరాడుతున్నారు. ఈ ఇద్దరు స్టార్ల మధ్య ఉన్న అనుబంధం కేవలం మాటలకే పరిమితం కాకుండా, రాబోయే రోజుల్లో దక్షిణ భారత రాజకీయాల్లో ఒక సరికొత్త సమీకరణానికి దారితీస్తుందేమోనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా, విజయ్ పొలిటికల్ సక్సెస్‌ను తన సొంత విజయంగా భావిస్తూ జగన్ ఫ్యాన్స్ చేస్తున్న హంగామా ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది.






