- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హిందూ మతాన్ని బలహీన పరచడానికి జగన్ కుట్ర: మంత్రి సత్యకుమార్
దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ తో హిందూ మతాన్ని బలహీనపరచే కుట్రకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాన పెడుతున్నారని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రంగా ధ్వజమెత్తారు...

దిశ, ఏపీ బ్యూరో: దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ తో హిందూ మతాన్ని బలహీనపరచే కుట్రకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాన పెడుతున్నారని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. బుధవారంనాడు తాడేపల్లి ప్యాలెస్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో జగన్ రెడ్డి చేసిన ఈ డిమాండ్ పై మంత్రి ఆక్షేపణ తెలిపారు. హిందూ మతం నుండి వలసలను ప్రోత్సహించేందుకు ప్రతయత్నిస్తూ జగన్ రెడ్డి తనదైన హైందవ వ్యతిరేకతను స్పష్టంగా వెల్లడించుకున్నారని మంత్రి స్పష్టం చేశారు. హిందూ మతాన్ని వీడిన వారికి రిజర్వేషన్లు కల్పిస్తే ఉత్పన్నమయ్యే పరిణామాలు ఆందోళనకరంగా ఉంటాయని, క్రమేణా హైందవ మతం బలహీన పడుతుందనే వాస్తవాన్ని ప్రజలు గమనించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. భారతీయ జనతా పార్టీ ఇందుకు వ్యతిరేకమని మంత్రి స్పష్టం చేశారు. క్రైస్తవ మతంలోకి మారిన ఒక పాస్టరు తన ఎస్సీ గుర్తింపును కోల్పోయినట్లు ఇటీవల రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
పాత సినిమా-కొత్త రిలీజ్
పాత సినిమా-కొత్త రిలీజ్ -ఆడని బొమ్మ' అన్న చందంగా జగన్ ప్రెస్‌మీట్ ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. రాష్ర్టంలో 'రూల్ ఆఫ్ ఫియర్ ' నెలకొన్నదంటూ 'న్యాయం, ధర్మం' గురించి జగన్‌రెడ్డి మాట్లాడడం చూసి దెయ్యాలు కూడా సిగ్గుతో తల దించుకుంటాయని మంత్రి అన్నారు. 'రూల్ ఆఫ్ లా' ఉన్నప్పుడు అరాచకాలు చేసేవారిలో మాత్రమే 'రూల్ ఆఫ్ ఫియర్' ఏర్పడుతుందని, రోజులు గడిచేకొద్దీ పలువురు వైసీపీ నాయకుల్లో భయంతో కూడిన వణుకు ఏర్పడుతోందని, జగన్ వ్యాఖ్యల్లో ఇది బయటపడిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జగన్ ఐదేళ్ల పాలనలో పలు అక్రమాలకు పాల్పడినవారంతా 'రూల్ ఆఫ్ లా' ప్రకారం మూల్యం చెల్లించుకోక తప్పదని మంత్రి స్పష్టం చేశారు.






