వైసీపీ నేతలకు జగన్ ఫోన్.. రాష్ట్రంలో ఆటవిక పాలన జరుగుతోందని ధ్వజం

by Naga Rani Yarlagadda |

తిరుమల లడ్డూ కల్తీ అంశం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనానికి దారితీసిన విషయం తెలిసిందే. దీనిపై వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీ శ్రేణులు ఇటీవల వైసీపీ నేతలపై దాడికి యత్నించారు.

వైసీపీ నేతలకు జగన్ ఫోన్.. రాష్ట్రంలో ఆటవిక పాలన జరుగుతోందని ధ్వజం
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల లడ్డూ కల్తీ అంశం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనానికి దారితీసిన విషయం తెలిసిందే. దీనిపై వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీ శ్రేణులు ఇటీవల వైసీపీ నేతలపై దాడికి యత్నించారు. ఈ క్రమంలో ఆయా నేతలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆదివారం ఫోన్ చేసి పరామర్శించారు. మాజీమంత్రి విడదల రజినీ, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడులతో ఫోన్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆటవిక పాలన జరుగుతోందంటూ జగన్ ధ్వజమెత్తారు. జంగిల్ రాజ్ రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని, రాష్ట్రంలో శాంతిభద్రతలు కుప్పకూలిపోయాయని వాపోయారు. చంద్రబాబు పోలీసులను అడ్డుపెట్టుకుని దుర్మార్గాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించకుండా దాడులు చేయిస్తున్నారని, ఈ సమయంలో పార్టీ నేతలంతా ధైర్యంగా ఉండాలని, పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని జగన్ వారికి ధైర్యం చెప్పారు.

Next Story