- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పార్టీకి పెద్దన్న పాత్ర పోషిస్తున్నది న్యాయవాదులే: జగన్
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో న్యాయవాదులే పార్టీకి పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. న్యాయవాదులు పిటిషన్ వేయకపోతే

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో న్యాయవాదులే పార్టీకి పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. న్యాయవాదులు పిటిషన్ వేయకపోతే న్యాయస్థానంలో న్యాయం కూడా దక్కదని చెప్పారు. కలియుగం అంటే చంద్రబాబు 14 నెలల పాలన చూస్తే అర్థం అవుతుందని అన్నారు. న్యాయం, ధర్మం ఏమీ లేవని మండిపడ్డారు. గిట్టని వాళ్లు, వ్యతిరేకంగా స్వరం వినిపించేవాళ్లు ఉంటే ఈ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోందని అన్నారు.
ఎలాగైనా చిత్రహింసలు పెట్టి జైలులో వేయాలనే నీచమైన సంస్కృతి రాష్ట్రంలో ఉందన్నారు. ఒక మనిషిని జైలులో పెట్టడం అంటే అతడి పరువు, ప్రతిష్టతలతో ఆడుకోవడమే అని వ్యాఖ్యానించారు. ఏ తప్పూ చేయనివారిపై బురద వేసి దొంగ సాక్ష్యాలను సృష్టించి సైతం ప్రలోభపెడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు న్యాయవాదులు చేస్తున్న సాయం ఎప్పటికీ పార్టీ మర్చిపోదు అని చెప్పారు. ఇది వరకు ఎప్పుడూ జరగని విధంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు న్యాయవాదులకు మంచి చేశామని అన్నారు.






