- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చంద్రబాబు హయాంలోనే కల్తీ నెయ్యి ట్యాంకర్లు వాడారు: జగన్
ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి వెళ్లారు. వారి కుటుంబాన్ని పరామర్శించి అనంతరం మీడియాతో మాట్లాడారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని ఆరోపించారు.

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి వెళ్లారు. వారి కుటుంబాన్ని పరామర్శించి అనంతరం మీడియాతో మాట్లాడారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు అబ్దాలను ప్రశ్నిస్తేనే వైసీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. గుంటూరులో అంబటి ఇంటిపై టీడీపీ గూండాలు దాడి చేశారని ధ్వజం ఎత్తారు. ఆయన ఇంట్లో ఐదు కార్లను ధ్వంసం చేసి, మహిళలను దూషించారని అన్నారు.
అంబటి ఇంటిపై దాడి చేసినట్టే జోగి రమేష్ ఇంటిపైనా దాడి జరిగిందన్నారు. చంద్రబాబు దేవుడిని రాజకీయాలకు వాడుకుంటారని చెప్పారు. లడ్డూలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ ఛార్జిషీట్ లో చెప్పారని తెలిపారు. 25 జూలై 2024లో నాలుగు నెయ్యి ట్యాంకర్లు తిరస్కరించారని.. ఆ నెయ్యి ట్యాంకర్లు మళ్లీ వాడారని ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారని తెలిపారు. చంద్రబాబు హయాంలోనే కల్తీ నెయ్యి ట్యాంకర్లు వాడారని అన్నారు. మరి పాపం చేసినవాళ్లు ఎవరు అని ప్రశ్నించారు. స్వార్థ రాజకీయాల కోసమే చంద్రబాబు లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పారని అన్నారు. వీళ్లు తప్ప ఎవరైనా కొవ్వు కలిసిందని చెప్పారా అని ప్రశ్నించారు.






