చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడ్డారు: జగన్ సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

సీఎం చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకి పాల్పడ్డారని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు...

చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడ్డారు: జగన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu) క్రెడిట్ చోరీకి పాల్పడ్డారని వైఎస్ జగన్(Ys Jagan) వ్యాఖ్యానించారు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో వైసీపీ(Ycp) విద్యార్థి విభాగం నాయకులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ గూగుల్(Google) విషయంలో చంద్రబాబు నాయుడు చోరీకి పాల్పడ్డారని ఆరోపించారు. మెడికల్ కాలేజీల(Medical Colleges) విషయంలో చెడు చేస్తున్నారని మండిపడ్డారు. తమ హయాంలో 17 మెడికల్ తీసుకువచ్చామని, సంవత్సరానికి వెయ్యి కోట్లు ఖర్చు పెడితే అన్ని మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క మెడికల్ కాలేజీని తీసుకురాలేకపోయారని విమర్శించారు. అంతేకాదు కాలేజీలను అమ్మేస్తున్నారని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.

Next Story