- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎవరైనా అలా చేస్తారా...?: చంద్రబాబుపై జగన్ ఫైర్
యూరియా కొరతపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు...

దిశ, వెబ్ డెస్క్: యూరియా(Urea) కొరతపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని వైఎస్ జగన్ పిలుపు నిచ్చారు. వైసీపీ(Ycp) విస్తృత స్థాయి సమావేశంలో కార్యకర్తలకు ఆయన కీలక సూచనలు చేశారు. దళారులతో చేతులు కలిపి ప్రభుత్వమే యూరియాను పక్కదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. బుద్ధి ఉన్నవాడెవడైనా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అమ్ముతాడా? అని ప్రశ్నించారు. ప్రైవేటు రంగం నుంచి ఏదీ పేదలకు అందదన్నారు. అమరావతిలో కనీస సదుపాయాలకే రూ.2లక్షల కోట్లు పెడతామంటున్నారని, కానీ మెడికల్ కాలేజీలకు రూ.5వేల కోట్లు పెట్టలేమంటూ అమ్మేస్తున్నారని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.
ఈ రోజు నుంచి అందుబాటులోకి తీసుకొచ్చిన వైసీపీ డిజిటల్ బుక్ యాప్(Ycp Digital Book App)పై మాట్లాడుతూ కార్యకర్తల కోసమే డిజిటల్ బుక్ లాంచ్ చేశామని తెలిపారు. ఎవరికి అన్యాయం జరిగినా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదులపై ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేయిస్తామన్నారు. ఎక్కడ ఉన్నా.. వాళ్లను తీసుకొచ్చి శిక్షిస్తామని హెచ్చరించారు. ఇప్పుడు వాళ్లు రెడ్‌బుక్ అంటున్నారని, డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో చూపిస్తానని వైఎస్ జగన్ తెలిపారు.
‘‘అధికారంలోకి వచ్చాక కార్యకర్తలకు న్యాయం చేస్తాం. కార్యకర్తల కారణంగానే 40 శాతం ఓట్ బ్యాంక్. నియోజకవర్గ స్థాయిలో అనుబంధ సంఘాలు ఏర్పాటు చేయాలి. సంక్రాంతి నుంచి కార్యకర్తలకు ఐడీ కార్డులు ఇస్తాం. ప్రతి కార్యకర్త డేటా ఆఫీస్‌లో ఉంటుంది.’’ అని జగన్ పేర్కొన్నారు.






