- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viveka Case: వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై రేపు విచారణ
వివేకానందారెడ్డి హత్య కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ నిందితుడు వైఎస్ భాస్కర్ రెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు...

X
దిశ, వెబ్ డెస్క్: వివేకానందారెడ్డి హత్య కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ నిందితుడు వైఎస్ భాస్కర్ రెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఈ పిటిషన్‌పై ధర్మాసనం విచారించనుంది. ఇప్పటికే ఈ కేసులో భాస్కర్ రెడ్డి జ్యూడీయల్ రిమాండ్‌లో ఉన్నారు. ఇందులో భాగంగా ఆయన గత నెల 16 నుంచి చంచల్ గూడ జైలులో ఉన్నారు. ఇటీవల వైఎస్ భాస్కర్ రెడ్డి వరుసగా అస్వస్థతకు గురయ్యారు. రెండు అస్వస్థతకు గురికావడంతో వైఎస్ భాస్కర్ రెడ్డికి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అనంతరం ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. ఇదే కేసులో తనయుడు వైఎస్ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందుస్తు బెయిల్ మంజూరు చేసింది. దీంతో వైఎస్ భాస్కర్ రెడ్డి కూడా నాంపల్లి సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు.
Next Story






