తప్పుడు కథనాలపై వైఎస్ భారతి సీరియస్.. లీగల్ నోటీసులు జారీ

by Vemula.Srinu Prasad |

తప్పుడు పోస్టులపై వైఎస్‌ భారతీరెడ్డి సీరియస్ అయ్యారు. ప్రసారం చేసిన యూట్యూబ్ చానళ్లకు ఆమె లీగల్‌ నోటీసులు జారీ చేశారు...

తప్పుడు కథనాలపై వైఎస్ భారతి సీరియస్.. లీగల్ నోటీసులు జారీ
X

దిశ, వెబ్ డెస్క్: తప్పుడు పోస్టులపై వైఎస్‌ భారతీరెడ్డి(Ys Bharati) సీరియస్ అయ్యారు. ప్రసారం చేసిన యూట్యూబ్ చానళ్లకు ఆమె లీగల్‌ నోటీసులు(Ligal Notices) జారీ చేశారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సోషల్ మీడియాలో కథనాలు, పోస్టులు పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. థింక్‌ ఆంధ్ర(Think Andhra), ఎం9తో పాటు గూగుల్‌, మెటా, ఎక్స్‌, యూట్యూబ్‌లకు వైఎస్‌ భారతీరెడ్డి నోటీసులు జారీ చేశారు. తక్షణమే ఆ కథనాలను, పోస్టులను తొలగించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఆ కథనాలు వ్యాప్తి చేస్తున్న అకౌంట్లను బ్లాక్‌ చేయాలని, అలాగే తప్పుడు కథనాలపై బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వైఎస్‌ భారతీరెడ్డి న్యాయవాది ప్రద్యుమన్‌ లీగల్‌ నోటీసుల్లో పేర్కొన్నారు.

Next Story