- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Liquor Case: వైపీసీ ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్
ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ కుంభకోణం కేసు(AP Liquor Case)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ కుంభకోణం కేసు(AP Liquor Case)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి(MP Mithun Reddy)కి ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కాసేపట్లో భారీ బందోబస్తు నడుమ మిథున్ రెడ్డిన రాజమండ్రిలోని సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. కాగా, ఈ కేసులో ఏ4గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని శనివారం సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. సిట్ విచారణకు హాజరైన ఆయన్ను.. సుమారు 6 గంటలకు విచారించి.. ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టగా, కోర్టు రిమాండ్ విధించింది. కాగా, మిథున్ రెడ్డికి చెందిన సంస్థలకు లిక్కర్ ముడుపులు వెళ్లినట్లు సిట్ గుర్తించింది. మరోవైపు ఇప్పటికే మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టేశాయి. ఈ కేసులో ఇప్పటివరకు 12మంది అరెస్ట్ అయ్యారు.






