- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇకపై ప్రజా సమస్యలపై పోరాడతా.. నా అన్వేషణ మరో సంచలన వీడియో
తాజాగా మరో వీడియో విడుదల చేసిన అన్వేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇకపై తాను ప్రజాసమస్యలపైనే మాట్లాడుతానని అన్నాడు.

దిశ, వెబ్ డెస్క్: శివాజీ వ్యాఖ్యలను ఖండిస్తూ వీడియో చేసిన తరవాత యూట్యూబర్ అన్వేష్ పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే యూట్యూబ్, ఇన్ స్టాలో అతడిని చాలా మంది అన్ ఫాలో చేశారు. ఈ క్రమంలో తనను టార్గెట్ చేస్తున్నవారిపై అన్వేష్ ఫైర్ అవుతున్నారు. మతం మత్తులో తనను టార్గెట్ చేస్తున్నారని, తెలుగు రాష్ట్రాల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నాడు. ఇక తాజాగా మరో వీడియో విడుదల చేసిన అన్వేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇకపై తాను ప్రజాసమస్యలపైనే మాట్లాడుతానని అన్నాడు. ఇకపై బూతులు మాట్లాడనని దేవుడిపై కూడా ప్రమాణం చేశానని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో బత్తాయి ముసుగులో చాలా అన్యాయాలు, అక్రమాలు చేస్తున్నారని ఆరోపించాడు. తనకు దేవుడు చెప్పాడని కాబట్టి ట్రావెలింగ్ పక్కన పెట్టి ప్రజాసమస్యలపైనే రోజుకు ఐదు వీడియోలు చేస్తానని చెప్పాడు. న్యాయం ధర్మాన్ని నాలుగు పాదాలపై నిలబెడతానని అన్నాడు. అంతే కాకుండా ఇకపై ఆడవాళ్లకు అండగా ఉంటానని, వారి కోసం మాట్లాడతానని చెప్పారు. ఈ ఏడాది మొత్తం తన వీడియోలు ప్రజాసమస్యలపైనే ఉంటాయని స్పష్టం చేశాడు.






