- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tragedy: సరియా జలపాతంలో గల్లంతైన యువకులు మృతి
సరియా జలపాతంలో గల్లంతైన యువకులు మృతి చెందారు..

దిశ, వెబ్ డెస్క్: దిశ, వెబ్ డెస్క్: అల్లూరి సీతారామరాజు జిల్లా(Alluri Seetharamaraju District) దేవరాపల్లి సరియా జలపాతం(Devarapalli Sariya Falls)లో గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. అనంతగిరి మండల జీనవాడు వద్ద నీటిలో కొట్టుకువచ్చాయి. విశాఖ పూర్ణ మార్కెట్ ప్రాంతానికి చెందిన ఆరుగురు యువకులు ఆదివారం సరియా జలపాతం వద్దకు విహారానికి వెళ్లారు. అనంతరం జలపాతంలో స్నానానికి దిగారు. తొలుత ఒక యువకుడు వాసు గల్లంతవగా మరో యువకుడు నరసింహా రక్షించే ప్రయత్నం చేశారు. కానీ ప్రమాదవశాత్తు ఇద్దరు జలపాతంలో కొట్టుకుపోయారు. సోమవారం జీవనాడు వద్ద మృతదేహాలను స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో జలపాతంలో గల్లంతయిన యువకులు వాసు, నరసింహగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. యువకుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి.






