తిరుమలలో రీల్స్ చేసిన యువకులు.. అరెస్ట్

by Muthe.Rajitha |

తిరుమలలో రీల్స్ చేయడాన్ని టీటీడీ నిషేధించిన సంగతి తెలిసిందే.

తిరుమలలో రీల్స్ చేసిన యువకులు.. అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుమలలో రీల్స్ చేయడాన్ని టీటీడీ నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే మంగళవారం తిరుమల కొండల్లో రీల్స్ చేస్తున్న ఐదుగురు యువకులను అధికారులు అదుపులోకి వస్తున్నాయి. ఒడిశా రాష్ట్రానికి చెందిన వీరంతా జీవకోనలో రోజువారీ కూలి పనులు చేస్తూ ఉంటారు. అరెస్ట్ చేసిన వారిలో ముఖేశ్ పీటర్, ములు షికార్, బిశ్వంత్ ప్రసాద్ నౌరి, లింగం ప్రదీప్ ఉన్నారు. కాగా మంగళవారం వీరు జీవకోన నుంచి అటవీ మార్గం ద్వారా కపిలతీర్థం దగ్గరికి వెళ్లి, అక్కడి నుంచి మాల్వాడి గుండం వద్ద రీల్స్ చేస్తుండగా.. అలిపిరి ఏవీఎస్వో రమేష్ కృష్ణ గమనించారు. వెంటనే విజిలెన్స్ సిబ్బందిని పంపించి వారిని అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం వారిని అలిపిరి పోలీసులకు అప్పగించారు. అయితే రీల్స్ నిషేధం విషయం తమకు తెలియదని, మొదటి తప్పుగా భావించి విడిచి పెట్టాలని వేడుకోగా.. పవిత్ర ప్రదేశంలో రీల్స్ చేయకూడదని, మరోసారి ఇలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి విడిచిపెట్టారు.

Next Story