- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రియురాలి ఇంటి ముందు దారుణం.. యువకుడు ఆత్మహత్యయత్నం
ప్రేమించిన యువతి దక్కదేమోనని యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా కంటేవారి పల్లెలో జరిగింది...

X
దిశ, వెబ్ డెస్క్: ప్రేమించిన యువతి దక్కదేమోనని యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా కంటేవారి పల్లెలో జరిగింది. ప్రొద్దుటూరుకు చెందిన ప్రదీప్.. అదే ఊరిలో ఉన్న యువతి ఐదేళ్లుగా ప్రేమించుకున్నారు. అయితే వీరి ప్రేమ విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో ఆమెను కంటేవారిపల్లెకి తీసుకెళ్లారు. ఈ మేరకు మనస్థాపం చెందిన ప్రదీప్.. కంటేవారిపల్లెలోని ప్రియురాలు ఇంటి వద్దకు వెళ్లారు. తన ప్రియురాలిని పంపాలని అడిగారు. దీంతో వారు నిరాకరించడంతో ఆత్మహత్యాయత్నం చేశారు. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు పెట్టుకున్నారు. స్థానికులు గమనించి మంటలు ఆర్పి మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. దీంతో ప్రదీప్‌కు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రదీప్ పరిస్థితి ఎలా ఉందనేది తెలియాల్సి ఉంది.
Next Story






