- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నీ ప్రేమ, బలం మా కుటుంబానికి ఆధారం.. సతీమణి భువనేశ్వరికి సీఎం స్పెషల్ బర్త్ డే విషెస్

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) బలగం టీడీపీ (TDP) నాయకులు, కార్యకర్తలైతే.. బలం సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari). నేడు ఆమె పుట్టిన రోజు కావడంతో సీఎం సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘X’ (ట్విట్టర్) వేదికగా స్పెషల్ విషెస్ చెప్పారు. ‘భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు’ మీ ప్రేమ, బలం మా కుటుంబానికి ఆధారం. ప్రతి ఎత్తు పల్లంలోనూ నీవు నా పక్కనే ఉన్నావు. నా జీవిత భాగస్వామిగా నువ్వు ఉన్నందుకు నిజంగా నేను కృతజ్ఞుడను. నీవు మా జీవితాలకు వెలుగు. నీ దయ, ప్రజల పట్ల నీ సంరక్షణ, వ్యాపారం, ధానధర్మాలలో హృదయపూర్వక నాయకత్వం మమ్మల్ని అందరినీ అబ్బురపరుస్తుంది’ అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
అదేవిధంగా సీఎం చంద్రబాబు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము (President Draupadi Murmu)కు ‘X’ వేదికగా బర్త్ డే విషెస్ తెలిపారు. ‘భారతదేశ ప్రథమ పౌరురాలు, శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. దీర్ఘాయుష్మంతులై, ఆరోగ్యవంతులై ఉండి, మీ జ్ఞానం, గౌరవంతో మన దేశాన్ని ప్రేరేపిస్తూ ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేశారు.






