- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖ సాగర్‌నగర్‌లో కలకలం.. లాడ్జిలో యువతి మృతి
విశాఖ సాగర్‌నగర్‌లోని లాడ్జిలో యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. లాడ్జి గదిలో ఆమె విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించిన సిబ్బంది వెంటనే అధికారులకు సమాచారం అందించారు. ..

దిశ, వెబ్ డెస్క్: విశాఖ(Visakha)లో యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సాగర్‌నగర్(Sagarnagar)లోని లాడ్జి గదిలో ఆమె విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించిన సిబ్బంది వెంటనే అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆరిలోవ పోలీసులు(Arilova Police) వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్ సహాయంతో గదిలో ఏవైనా ఆధారాలు దొరుకుతాయేమోనని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. మృతురాలిని శాంతికుమారిగా పోలీసులు గుర్తించారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ (KGH) కి తరలించారు.
శాంతికుమారి మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు
ఇక శాంతికుమారి మృతిపై ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ‘ఆమె లాడ్జికి ఎప్పుడు వచ్చింది?. ఎవరితో కలిసి ఉంది?. అనే విషయాలను తెలుసుకోవడానికి లాడ్జిలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే ఇది ఆత్మహత్యా లేక హత్య అనే విషయాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.






