చేపల వేటకు వెళ్లి ఊబిలో చిక్కుకున్న వృద్ధుడు.. కాపాడిన యువకులు

by Vemula.Srinu Prasad |

చేపల వేటకు వెళ్లి ప్రమాదంలో పడిన వృద్ధుడిని యువకులు కాపాడారు..

చేపల వేటకు వెళ్లి ఊబిలో చిక్కుకున్న వృద్ధుడు.. కాపాడిన యువకులు
X

దిశ, వెబ్ డెస్క్: ఈ రోజు చేపల(Fishes) పులుసుతో భోజనం చేయాలని ఓ వృద్ధుడు అనుకున్నారు. డబ్బులులో కాకుండా చేపలను స్వయంగా తాను పట్టుకోవాలన్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కాలువను చూసుకున్నారు. ఇక వేట ప్రారంభించారు. అయితే అనుకోని ఘటన ఎదురైంది. దీంతో వామ్మో, వాయ్యో అంటూ కేకలు వేశారు. స్థానికులు రక్షించడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగింది.

ఏలూరు జూట్ మిల్లు(Eluru Jute Mill) సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జి కింద చేపలు, నత్తలను పట్టేందుకు వృద్ధుడు బాజీరావు ప్రయత్నం చేశారు. అయితే ఒక్కసారిగా ఊబిలో చిక్కుకుపోయారు. ప్రాణభయంతో పెద్ద పెద్డగా కేకలు వేశారు. బాజీరావు పరిస్థితిని గమనించిన యువకులు.. తాడు సాయంతో బయటకు తీశారు. ప్రమాదం నుంచి బయటపడటంతో బాజీరావు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story