మైనర్ బాలికను గర్భవతిని చేసిన యువకుడు

by Thanuru Gopichand |

చిత్తూరు (Chittoor) జిల్లా పాలసముద్రంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

మైనర్ బాలికను గర్భవతిని చేసిన యువకుడు
X

దిశ, వెబ్ డెస్క్ : చిత్తూరు (Chittoor) జిల్లా పాలసముద్రంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో ఓ మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన జిల్లాలో కలకలం రేపింది. ఆమె గర్భం దాల్చడానికి కారణమైన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల వివరాల ప్రకారం నిందితుడు దినేష్ సదరు బాలికను ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడు. అనంతరం బాలికతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. కొద్దిరోజులుగా బాలిక శరీరంలో వస్తున్న మార్పులను గమనించిన తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించి బాలిక గర్భవతి అని నిర్ధారించారు. వైద్య పరీక్షల ఫలితాలను చూసి నిర్ఘాంతపోయిన తల్లిదండ్రులు బాలికను నిలదీశారు. దీంతో నిందితుడు దినేష్ చేసిన దారుణాన్ని బాలిక వారికి వివరించింది. వెంటనే బాధితురాలి కుటుంబ సభ్యులు పాలసముద్రం పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై ఫిర్యాదు చేశారు.

​బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాలతో కేసు నమోదు చేశారు. డిస్పీ సయ్యద్ మహమ్మద్ అజిజ్ నేతృత్వంలో సీఐ హనుమంతప్ప ఈ కేసులో లోతైన విచారణ జరిపారు. నిందితుడు దినేష్‌పై పోక్సో (POCSO) చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పాలసముద్రం ఎస్ఐ రాజశేఖర్ నిందితుడిని చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని స్థానిక కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి అతనికి రిమాండ్ విధించారు. చట్టం ప్రకారం మైనర్లపై ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, బాధితులకు న్యాయం చేస్తామని పోలీసులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Next Story