- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tirumala:శ్రీవారిని దర్శించుకున్న యంగ్ హీరో
తిరుమల(Tirumala) శ్రీ వేకంటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు.

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala) శ్రీ వేకంటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. ఈ క్రమంలో శ్రీవారికి భక్తి శ్రద్ధలతో పూజ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. సినీ సెలబ్రీటిలు, రాజకీయ ప్రముఖులు సైతం కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నేపథ్యంలో నేడు(శుక్రవారం) టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Hero Nithin) శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి ఆయన శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఈ క్రమంలో టీటీడీ(TTD) అధికారులు వీరికి ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో హీరో నితిన్‌కు వేద పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు. ఇదిలా ఉంటే.. హీరో నితిన్, యంగ్ బ్యూటీ శ్రీలీల(Srilila) కాంబోలో తెరకెక్కిన 'రాబిన్‌హుడ్' థియేటర్లలో సందడి చేస్తోంది. నేడు ఈ మూవీ రిలీజ్ అయిన నేపథ్యంలోనే తిరుమల శ్రీవారిని నితిన్ దర్శించుకున్నట్లు సమాచారం.






