- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pawan kalyan : పక్కాగా మీకు ప్రతిపక్ష హోదా రాదు.. తేల్చి చెప్పిన పవన్ కళ్యాణ్
వైసీపీకి ఈ ఐదేళ్లలో ప్రతిపక్ష హోదా రాదని..దానికి వారంతా మానసికంగా సిద్ధపడి ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్అ న్నారు.

దిశ డైనమిక్ బ్యూరో: వైసీపీకి ఈ ఐదేళ్లలో ప్రతిపక్ష హోదా రాదని..దానికి వారంతా మానసికంగా సిద్ధపడి ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan kalyan) అన్నారు.అసెంబ్లీ( Ap Assembly) మీడియా పాయింట్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని వైసీపీ అనడం సరైన విధానం కాదన్నారు. 11 సీట్లు ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని ప్రశ్నించారు. ప్రజలందరికీ ఈ విషయం తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇవాళ ఏపీలో అతి పెద్ద రెండో పార్టీ జనసేన అని గుర్తు చేశారు. ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇస్తే వస్తుందన్నారు. మీరు అసెంబ్లీకి రండి.. మీకు ఎన్ని ప్రశ్నలు ఇవ్వాలో అన్ని ఇస్తారని అన్నారు. వైసీపీ హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. గవర్నర్ ప్రసంగాన్ని ఆ విధంగా అడ్డుకోవడం సరికాదన్నారు. అరుపులు కేకలు వేయటం సమంజసం కాదన్నారు. అసెంబ్లీకి వచ్చి గొడవ పెట్టుకోవడం, లో లెవెల్ స్టేటజీ అని అన్నారు. సభకు రావాలి ప్రజా సమస్యలు ప్రస్తావించాలన్నారు. ఈ ఐదేళ్లలో మీకు ప్రతిపక్ష హోదా రాదు.. దానికి మీరు మానసికంగా సిద్ధపడాలని అన్నారు. 11 సీట్లతోటి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదన్నారు. ప్రజాస్వామ్య విలువలను పాటించాలని వైసీపీని కోరుతున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.






