- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘పొలిటికల్ సీరియస్ గురించి మీరే మాట్లాడాలి’.. MLC కవిత పై జనసేన నేత ఫైర్
ఎమ్మెల్సీ కవిత పై ఏపీ జనసేన నేత ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ,వెబ్‌డెస్క్: ఎమ్మెల్సీ కవిత పై ఏపీ జనసేన నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Deputy Cm pawan Kalyan) పై తెలంగాణ(Telangana) బీఆర్‌ఎస్(BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమా(Social Media)ల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదని, దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యారన్న తెలంగాణ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై జనసైనికులు తీవ్ర స్థాయిలో భగ్గుమంటున్నారు. ఏ మాత్రం పొలిటికల్ నాలెడ్జ్ లేకుండానే పవన్ కళ్యాణ్ గత ఏడాది జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ రాజకీయానికి మీ రాజకీయానికి చాలా తేడా ఉందంటూ జనసేన(Janasena) సైనికులు సెటైర్లు పేల్చుతున్నారు. ఈ క్రమంలో తాజాగా జనసేన నేత, ప్రముఖ కమెడియన్ పృథ్వీరాజ్(Prithviraj) ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యల పై స్పందించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదా?.. పొలిటికల్ సీరియస్ గురించి మేడం మాట్లాడటం బాగుందని ఎద్దేవా చేశారు. ఇచ్చిన శాఖకు 200 శాతం న్యాయం చేసిన పవన్ కళ్యాణ్ ఎక్కడ, పదవి అడ్డుపెట్టుకుని మద్యం కుంభకోణం చేసిన మీరెక్కడ అంటూ జనసేన నేత పృథ్వీ రాజ్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.






