- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎలుకలు తింటుంటే చూసుకోవాలి కదా!
విజయవాడలోని కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో (VIjayawada New Government Hospital) వింత పరిస్థితి నెలకొంది.

దిశ, వెబ్ డెస్క్ : విజయవాడలోని కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో (VIjayawada New Governmetn Hospital) వింత పరిస్థితి నెలకొంది. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆసుపత్రి ఆవరణలో ఉన్న హోటల్లో ఎలుకలు రాజ్యమేలుతున్న (Rats Rulling) దృశ్యం ఆ వీడియోలో ఆవిషృతమైంది. వివరాల్లోకి వెళ్తే విజయవాడలోని కొత్త ప్రభుత్వాసుపత్రిలో ఓ ప్రైవేట్ హోటల్ ఉంది. దాన్ని డ్వాక్రా కింద కేటాయించినట్లు తెలుస్తోంది. హాస్పిటలుకు వచ్చే పేషంట్ల బంధువులు, ఇతరులకు టిఫిన్స్, భోజనాలను విక్రయించేందుకు హోటల్ కు అనుమతి ఉంది. అయితే హోటల్లో వంట కోసమని సిద్ధం చేసిన నూడుల్స్ ఎలుకలపాలైన ఘటన ఒకటి వెలుగు చూసింది. ఉడకబెట్టి చల్లారెందుకు పక్కన ఉంచిన నూడుల్స్ ను ఎలుకలు గుంపుగా చేరి తినడం కళ్ల ముందు కనిపించింది. అయితే ఓ పీజీ విద్యార్థి ఈ వింతను గమనించారు. ఎలుకరాజులు భలే చక్కగా తింటున్నాయనుకుంటూ వీడియోను చిత్రీకరించారు. దానిని సోషల్ మీడియాలోకి ఎక్కించడంతో ఇదెక్కడి గోలరా బాబు అనుకుంటున్నారు జనాలు. అయితే నిర్వాహణ లోపం కారణంగానే ఇటువంటి దృశ్యం ఆవిష్కృతమైందని పలువురు అంటున్నారు. దీనిపై విచారణ జరిపించి వాస్తవాలను గ్రహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే ఎలుకలు తింటున్న ఆహారాన్ని వినియోగదారులకు వడ్డిస్తుంటే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.






