- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘పవన్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు’.. మాజీ మంత్రి పై మంత్రి ఆగ్రహం
రాష్ట్రంలో వైసీపీ(YSRCP), టీడీపీ నేతల(TDP) మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో వైసీపీ(YSRCP), టీడీపీ నేతల(TDP) మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇటీవల సీఎం చంద్రబాబు(CM Chandrababu), మంత్రి లోకేష్(Minister Nara Lokesh) ఏపీ(Andhra Pradesh)లో పెట్టుబడులే లక్ష్యంగా దావోస్(Dawos) పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన పై వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా(Former Minister Roja) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను సీఎం చంద్రబాబు దావోస్‌కు ఎందుకు తీసుకెళ్లలేదంటూ ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి రోజా వ్యాఖ్యలపై మంత్రి కందుల దుర్గేష్(Minister Kandula Durgesh) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. క్యాబినెట్ మొత్తాన్ని ఎవరూ దావోస్ తీసుకెళ్లారని అన్నారు. పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) గురించి మాట్లాడే అర్హత రోజాకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాటు మంత్రిగా ఈ రాష్ట్రానికి ఆమె ఏం చేశారు? రిషికొండపై జగన్(YS Jagan) భవనాలు కడుతున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అని మంత్రి దుర్గేష్ ప్రశ్నించారు. దీని కారణంగా పర్యాటక శాఖ నష్టపోయింది అని విమర్శించారు.






