- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యోగా జీవితంలో భాగం కావాలి.. : సీఎం చంద్రబాబు
మన జీవితంలో భాగం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు.

దిశ, డైనమిక్ బ్యూరో : మన జీవితంలో భాగం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు.సచివాలయంలో ఆయన ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ యోగ వారసత్వంగా మనకు వచ్చిన సంపదన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు అయ్యారని తెలిపారు. రెండు కోట్ల మందిని రిజిస్ట్రేషన్ చేయించడానికి టార్గెట్ పెట్టుకోగా ఈరోజు వరకు రెండు కోట్ల 39 లక్షల మంది యోగాంధ్ర కార్యక్రమానికి నమోదయ్యారని తెలిపారు. 119.5% అచీవ్మెంట్ సాధించామన్నారు. 9వ తరగతి నుంచి విద్యార్థులు యోగా చేయాలన్నారు. భవిష్యత్తులో ఆఫ్లైన్ ఆన్లైన్ శిక్షణ కోర్సులు నిర్వహిస్తామన్నారు. గత నెల 21వ తేదీ నుంచి ఈ నెల 21 వరకు యోగ పై ప్రత్యేక కార్యక్రమాలు చేప ట్టామని తెలిపారు. ఎల్లుండి రాష్ట్రంలో 1.30 లక్షల ప్రాంతాలలో యోగ నిర్వహిస్తామని అన్నారు. దేశమంతా దాదాపు ఏడు లక్షల ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు చేపడుతారని వెల్లడించారు. ప్రపంచమంతా ఎనిమిది లక్షల ప్రాంతాల్లో యోగా డేలో పాల్గొంటారని చంద్రబాబు వివరించారు. విశాఖలో 3.5 లక్షల మంది మొబలైజ్ చేసేలా ఏర్పాటు చేశామన్నారు. రామకృష్ణాపురం బీచ్ నుంచి భోగాపురం వరకు కార్యక్రమాలు చేపడతామన్నారు. యోగాకు ఎటువంటి మతానికి సంబంధం లేదన్నారు






