నెలరోజులపాటు రాష్ట్రంలో యోగా మంత్ : సీఎం చంద్రబాబు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-16 12:36:22  IST  )

ప్రజలంతా యోగా డే లో భాగస్వాములయ్యేలా ప్రచారం చేయాలని సీఎం చంద్రబాబు చెప్పారు. యోగాంధ్ర -2025 (Yogandhra - 2025) పేరుతో రాష్ట్రమంతా ప్రచారం చేపట్టాలని తెలిపారు.

నెలరోజులపాటు రాష్ట్రంలో యోగా మంత్ : సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: జూన్ 21న విశాఖలో నిర్వహించే అంతర్జాతీయ యోగా డే (International Yoga Day) వేడుకలు రికార్డు సృష్టించేలా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu)అధికారులకు సూచించారు. ఆ రోజున ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) విశాఖకు రానున్న క్రమంలో నేడు అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో.. ప్రజలంతా యోగా డే లో భాగస్వాములయ్యేలా ప్రచారం చేయాలని చెప్పారు.

యోగాంధ్ర -2025 (Yogandhra - 2025) పేరుతో రాష్ట్రమంతా ప్రచారం చేపట్టాలని తెలిపారు. ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకూ యోగా మంత్ గా పాటించాలని, ఈ నెలరోజుల్లో ప్రజలకు యోగాపై శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. శిక్షణ పూర్తి చేసుకున్నవారికి సర్టిఫికెట్ కూడా ఇవ్వాలని అధికారులకు సూచించారు. ప్రధాని నరేంద్రమోదీ విశాఖలో జరిగే యోగా డే వేడుకల్లో పాల్గొని లక్షలాది మందితో యోగాసనాలు వేయనుండటంతో.. ఆర్కే బీచ్ నుంచి తీరం పొడవునా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Next Story