‘యోగా అంటే కేవలం ఆసనాలే కాదు’.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-21 03:16:02  IST  )

ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏపీ(Andhra Pradesh)లోని విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే.

‘యోగా అంటే కేవలం ఆసనాలే కాదు’.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏపీ(Andhra Pradesh)లోని విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ప్రజలు హాజరవుతున్నారు. యోగాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కూటమి మంత్రులు, అధికారులు, కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) అందరికీ ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ క్రమంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. యోగ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. శారీరక శక్తిని, మనస్సుకు ప్రశాంతతను చేకూరుస్తుంది. ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప వరం యోగా అని మంత్రి తెలిపారు. కేవలం ఆసనాలే కాదు.. యోగా అంటే మన జీవన విధానం. జీవితంలో క్రమశిక్షణను అలవరుస్తుంది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాంధ్రను కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. విశాఖలో 5 లక్షల మందితో, రాష్ట్రవ్యాప్తంగా లక్షకు పైగా ప్రాంతాల్లో 2 కోట్ల మందితో రికార్డు స్థాయిలో యోగాసనాలు నిర్వహించడం జరుగుతుందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషమే స్వర్ణాంధ్ర లక్ష్యం. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని ఆకాంక్షిస్తున్నానని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.

Next Story