- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖ బీచ్‌రోడ్డులో 'యోగాంధ్ర' వాకథాన్.. పాల్గొన్న ఏపీ మంత్రులు
అంతర్జాతీయ యోగా దినోత్సవం ( International Day of Yoga) కార్యక్రమం వైజాగ్ లో ( Vizag) నిర్వహించబోతున్నారు. ఈ మేరకు

దిశ, వెబ్ డెస్క్ : అంతర్జాతీయ యోగా దినోత్సవం ( International Day of Yoga) కార్యక్రమం వైజాగ్ లో ( Vizag) నిర్వహించబోతున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఇందులో భాగంగానే.. యోగాంధ్ర కార్యక్రమం పైన ( Yogandhra programme ) విశాఖపట్నం బీచ్ రోడ్డులో ( Visakhapatnam Beach Road ) వాకథాన్ నిర్వహించారు. ఏయు కన్వెన్షన్ హాల్ నుంచి విశ్వప్రియ హాల్ వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రులు కూడా పాల్గొన్నారు.
ఏపీ మంత్రులు డిబివి స్వామి, సత్య కుమార్ బీసీ జనార్దన్ రెడ్డి, సవిత, యోగా దినోత్సవం నోడల్ అధికారి కృష్ణ బాబు, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తదనంతరం విశ్వప్రియ ఫంక్షన్ హాల్ వద్ద ప్రజలతో కలిసి మంత్రులు అటు ఏపీ అధికారులు యోగాసనాలు వేశారు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.






