- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖలో యోగాంధ్ర వేడుకలు.. ప్రత్యేక సెల్ టవర్లు ఏర్పాటు
రేపు (జూన్ 21) 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: రేపు (జూన్ 21) 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (International Yoga Day) పురస్కరించుకొని విశాఖపట్నంలో (Vishakapatnam) యోగాంధ్ర (Yogandhra) వేడుకలను కూటమి ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననుండడంతో దేశ వ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో విశాఖలో పోలీసులు అణువణువు నిఘా పెట్టారు. కమాండ్ కంట్రోల్ నుంచి నిరంతర పర్యవేక్షణ జరుగుతుంది. ప్రధాన వేదిక ఆర్కే బీచ్ రోడ్‌లో అదనపు భద్రత ఏర్పాటు చేశారు.
అలాగే, ఈ యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించి సాంకేతిక సౌకర్యాలను మెరుగుపరిచేందుకు టెలికాం సంస్థలు ముందుకొచ్చాయి. యోగా కార్యక్రమం జరిగే ఆర్కే బీచ్ ప్రాంతంలో ప్రజలకు నిరవధికంగా నెట్‌వర్క్, డేటా సేవలు అందించేందుకు 20కి పైగా శాశ్వత సెల్‌టవర్లను ప్రముఖ టెలికాం సంస్థలు ఏర్పాటు చేశాయి. ఎయిర్‌టెల్‌తో పాటు ఇతర సర్వీస్ ప్రొవైడర్లు కూడా తమ సేవలను బలోపేతం చేసి, అధిక కవరేజ్‌తో కూడిన హైపవర్ టవర్లను ఏర్పాటు చేశారు. దీనివల్ల కార్యక్రమానికి హాజరయ్యే వేలాది మంది పాల్గొనేవారికి మొబైల్ కాల్స్, ఇంటర్నెట్ సేవలు లాఘవంగా అందుబాటులో ఉండనున్నాయి.
ముఖ్యంగా వీడియోల ప్రసారం, సోషల్ మీడియా షేరింగ్ వంటి డేటా ఆధారిత సేవలు వేగంగా అందుతాయని కంపెనీలు వెల్లడించాయి. ప్రభుత్వం, పోలీస్ శాఖ, ఇతర యంత్రాంగాలకు కూడా ఈ సాంకేతిక వేదికలు మెరుగైన కమ్యూనికేషన్ వ్యవస్థను అందించనున్నాయి. యోగాంధ్ర ఘనంగా నిర్వహించేందుకు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు తీసుకుంటున్న ఈ చర్యలు ప్రశంసనీయంగా మారాయి.






