- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యోగాంధ్ర 2025...విద్యార్థుల వినూత్న ప్రదర్శన.. ఫోటోలు వైరల్
ఈ నెల 21వ తేదీన... అంటే రేపు ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం ( International Day of Yoga) జరగనున్న సంగతి

దిశ, వెబ్ డెస్క్ : ఈ నెల 21వ తేదీన... అంటే రేపు ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం ( International Day of Yoga) జరగనున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో... యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు.. ఏపీ తోపాటు అన్ని ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. ఇక ఈ యోగా దినోత్సవం నేపథ్యంలో... గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద.. యోగాంధ్ర 2025 ఆకృతి ప్రదర్శన చేశారు. విద్యార్థులు అందరూ కలిసి... ఇందులో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ తాడిబోయిన రాధిక మాట్లాడారు. యోగ ప్రాముఖ్యతను గుర్తించిన దేశాల ప్రజలు చిన్న వయసు నుంచే యోగాసనాలు వేయడంలో శిక్షణ తీసుకుంటున్నారని వెల్లడించారు. అటు పురపాలక శాఖ అధికారులు... టిఎన్ఎల్ యోగాంధ్ర 2025 అని మున్సిపల్ కార్యాలయం ముందు రోడ్డుపై రాయించిన అక్షరాలు, అంకెలలో నగర దీపికలు, పురపాలక పాఠశాలల విద్యార్థులు ఆ అక్షరాలపై ఒదిగిపోయారు.






