- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP Deputy CM:దీన స్థితిలో అలనాటి నటి.. చలించిపోయిన పవన్ కళ్యాణ్.. తక్షణమే?
అలనాటి నటి పాకీజా(వాసుగి) ఇటీవల గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ తన దీన స్థితి గురించి చెబుతూ కన్నీరుమున్నీరుగా విలపించారు.

దిశ,వెబ్‌డెస్క్: అలనాటి నటి పాకీజా(వాసుగి) ఇటీవల గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ తన దీన స్థితి గురించి చెబుతూ కన్నీరుమున్నీరుగా విలపించారు. తన దుస్థితి గురించి తమిళ ఇండస్ట్రీ పట్టించుకోలేదని.. ఏపీ ప్రభుత్వం(AP Government) తనను ఆదుకుంటుందన్న ఆశతో ఇక్కడికి వచ్చానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), సీఎం చంద్రబాబు(CM Chandrababu) తనకు సాయం చేయాలని ఆమె కోరారు. ఈ నేపథ్యంలో ఆమె దీన స్థితి పై పవన్ కల్యాణ్ స్పందించారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సినీ నటి వాసుగికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం అందించారు.
ఆమె దీన స్థితి తెలిసీ చలించిన పవన్ కళ్యాణ్ రూ. 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. మధ్యాహ్నం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఈ మొత్తాన్ని శాసన మండలిలో ప్రభుత్వ విప్ హరిప్రసాద్, పి.గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ నటి పాకీజాకు అందజేశారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ చేసిన సాయానికి పాకీజా కృతజ్ఞతలు తెలిపారు. చిన్నవాడైనా ఎదురుగా ఉంటే కాళ్లు మొక్కుతానంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తన ఆర్థిక పరిస్థితి గురించి నిన్ననే పవన్ కళ్యాణ్ కార్యాలయానికి తెలియజేశానని, తక్షణమే స్పందించి తగిన విధంగా ఆర్థిక సాయం అందించారని తెలిపారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటానని ఆమె ఎమోషనల్ అయ్యారు.






