TDP:గజపతి నగరంలో గర్జించిన పసుపు జెండా!

by Jakkula.Mamatha |

ఏపీ(Andhra Pradesh)లో టీడీపీ(TDP) 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిన్న(మార్చి 29) ఘనంగా నిర్వహించారు.

TDP:గజపతి నగరంలో గర్జించిన పసుపు జెండా!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లో టీడీపీ(TDP) 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిన్న(మార్చి 29) ఘనంగా నిర్వహించారు. టీడీపీ శ్రేణులు ఒక రోజు ముందే పార్టీ ఆవిర్భావ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, సామూహిక అన్నదాన కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు. సిక్కోలు నుంచి చిత్తూరు వరకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నాయి.

మంత్రులు సైతం పెద్ద ఎత్తున తమ తమ నియోజకవర్గాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉత్తరాంధ్రలో యువ మంత్రి, గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్(Kondapalli Srinivas).. వేడుకలను ముందుండి నడిపించారు. నియోజకవర్గంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంతో పాటు పలు కార్యక్రమాల్లో మంత్రి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్ని గ్రామాల్లో ముందస్తు షెడ్యూల్ కారణంగా అందుబాటులో లేకపోయినా, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించారని తెలిపారు.

తాను హాజరు కాలేకపోయిన కార్యక్రమాలు నిర్వహించిన కార్యకర్తలతో, నాయకులతో స్వయంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఫోన్‌లో మాట్లాడారు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలు, నాయకులను అభినందించారు. పార్టీ కార్యక్రమాలకు ఈ మధ్య దూరంగా ఉన్న నాయకులు కూడా మంత్రి పిలుపుతో ముందుకు వచ్చారు. ఇక ఉత్తరాంధ్రలో ఇతర నాయకులు సైతం వేడుకలను ఘనంగా నిర్వహించారు. మారుమూల పల్లెల్లో సైతం పెద్ద ఎత్తున కార్యకర్తలు ఓ పండుగగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించడం గమనార్హం. ఈ తరుణంలో పార్టీ కార్యకర్తలకు మంత్రి దిశానిర్దేశం చేశారు.

Next Story