- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమరావతిపై వైసీపీ వ్యూహాత్మక నిర్ణయం: మూడు ప్రత్యేక కమిటీల ఏర్పాటు
రాజధాని అమరావతి అంశంలో వైస్సార్సీపీ కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. అమరావతి ప్రాంతంలో పార్టీ తరఫున కార్యాచరణను పటిష్టం చేసేందుకు, అదే సమయంలో న్యాయపరమైన అంశాలను ఎదుర్కొనేందుకు వీలుగా రెండు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. అమరావతి పరిధిలో రైతుల సమస్యలు, ప్రాంతీయ పరిణామాలను పర్యవేక్షించేందుకు 8 మంది సభ్యులతో కూడిన ‘రైతు పరిరక్షణ కమిటీ’ని వైస్సార్సీపీ నియమించింది. ఈ కమిటీలో కమిటీలో వైస్సార్సీపీ సీనియర్ నేతలు పేర్ని నాని, అంబటి రాంబాబు, దేవినేని అవినాశ్, నందిగం సురేశ్, అప్పిరెడ్డి, అరుణ్ కుమార్, వజ్రబాబు సభ్యులుగా ఉన్నారు.
న్యాయ పోరాట కమిటీ..
ఇక అమరావతి రాజధాని వ్యవహారాలకు సంబంధించిన వివాదాలపై కోర్టులలో పార్టీ తరఫున వాదనలు బలంగా వినిపించేందుకు, చట్టపరమైన చర్యల కోసం లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక ‘న్యాయపోరాట కమిటీ’ని కూడా నియామకం చేసింది. ఇందులో సభ్యులుగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, సుదర్వన్ రెడ్డి, కిషోర్ ఉంటారు. రాజధాని ప్రాంతంలో క్షేత్రస్థాయిలో రైతుల పక్షాన నిలబడటంతో పాటు, ఇటు న్యాయస్థానాల్లో కూడా గట్టిగా పోరాడేందుకు వీలుగా వైసీపీ ఈ వ్యూహాత్మక కమిటీలను ఏర్పాటు చేసినట్లుగా పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది.
డీఎస్సీ పోరాట కమిటీ
చివరగా.. ఐదుగురు సభ్యులతో డీఎస్సీ పోరాట కమిటీని నియమించారు. ఇందులో సభ్యులుగా అప్పిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, కల్పలత, చైతన్య, రవిచంద్ర ఉంటారని వైసీపీ రాష్ట్ర అధినాయకత్వ నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.






