నెయ్యి టెండర్లపై YCP దుష్ప్రచారం: వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్ BR నాయుడు

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-18 17:53:24  IST  )

తిరుమల నెయ్యి టెండర్లపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ, ఇందాపూర్ డెయిరీ ఎంపికలోని పారదర్శకత, కొత్త నాణ్యత ప్రమాణాలను టీటీడీ చైర్మన్ వివరించారు.

నెయ్యి టెండర్లపై YCP దుష్ప్రచారం: వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్ BR నాయుడు
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల నెయ్యి సరఫరా చేసేందుకు వేసిన కొత్త టెండర్లపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది. ఎలాంటి ఆధారాలు లేకుండానే నోటికొచ్చినట్లుగా అబద్ధాలు ఆడుతోంది. శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. హెరిటేజ్‌కు సంబంధం ఉన్న ఇందాపూర్ డెయిరీకి టెండర్లు అప్పగించారని, ఇందాపూర్ సంస్థకు రేట్లు పెంచేసి ఇచ్చారంటూ రచ్చ చేస్తున్నారు. కానీ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రస్తుతం నెయ్యి కొనుగోళ్లలో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. MRL (Maximum Residue Limit) స్కోర్ బోర్డు విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. నెయ్యి సేకరణ పరిధిని 1500 కిలోమీటర్ల నుంచి 800 కిలోమీటర్లకు తగ్గించి, నాణ్యతను పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇందాపూర్ డెయిరీకి, హెరిటేజ్‌కు అసలు సంబంధమే లేదు. ఈ విషయాన్ని బీఆర్ నాయుడు ఆధారాలతో సహా వివరించారు. ఇందాపూర్ డెయిరీ నుంచి హెరిటేజ్ కేవలం 'చీజ్' మాత్రమే కొంటుంది. నిజానికి చాలా సంస్థలు ఇందాపూర్ డెయిరీ నుంచే కొనుగోళ్లు చేస్తాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం టెండర్లు కట్టబెట్టిన అమూల్ డెయిరీ కూడా ఇందాపూర్ నుంచే కొనేది. ఇక 'నందిని డెయిరీని' పక్కన పెట్టేశారని చెబుతున్న మాట కూడా అవాస్తవం. తాము అంత మొత్తంలో నెయ్యిని సరఫరా చేయలేమని నందిని డెయిరీ స్వయంగా తెలపడంతోనే ఇందాపూర్ సంస్థకు టెండర్లు ఇచ్చింది టీటీడీ. ప్రస్తుతానికి ఇందాపూర్ డెయిరీకి రెండు, సంగం డెయిరీకి ఒకటి, మదర్ డెయిరీకి రెండు టెండర్లు ఇచ్చారు. ఈ ప్రక్రియ అంతా అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా జరుగుతోందని టీటీడీ చెబుతోంది. కానీ వైసీపీ మాత్రం ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారాలు చేస్తోంది.

Next Story