- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Palnadu:వైసీపీ కార్యకర్త దారుణ హత్య..ఈ ఘటనపై రాష్ట్రపతికి వైసీపీ ఫిర్యాదు
పల్నాడు జిల్లా వినుకొండలో బుధవారం వైసీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. ఈ క్రమంలో పల్నాడు ఎస్పీ శ్రీనివాస్ రావు తాజాగా ఈ కేసులో పాత కక్షలే కారణమని వెల్లడించారు.

X
దిశ,వెబ్‌డెస్క్: పల్నాడు జిల్లా వినుకొండలో బుధవారం వైసీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. ఈ క్రమంలో పల్నాడు ఎస్పీ శ్రీనివాస్ రావు తాజాగా ఈ కేసులో పాత కక్షలే కారణమని వెల్లడించారు. అయితే ఈ ఘటనపై మండిపడ్డ వైసీపీ ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపుతప్పాయని, తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. వెరీ బ్యాడ్ మార్నింగ్ అంటూ..ఈ మేరకు వైసీపీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ట్వీట్ చేసింది. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఇది వెరీ బ్యాడ్ మార్నింగ్ రాష్ట్రపతి మేడం. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకుని, రాష్ట్ర ప్రజలను కాపాడండి. అలాగే మాకు ప్రతి భారతీయుడి మద్దతు కావాలని కోరుతున్నాం’’ అని రాష్ట్రపతిని ట్యాగ్ చేస్తూ వైసీపీ ట్వీట్ చేసింది.
Next Story






