- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘విజయవాడ ఉత్సవ్’పై YCP ఆరోపణలు అవాస్తవం.. బుద్ధా వెంకన్న కీలక వ్యాఖ్యలు
విజయవాడ ఉత్సవ్ (Vijayawada Utsav)పై ప్రధాన ప్రతిపక్షం వైసీపీ (YCP) చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని వైసీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న (Buddha Venkanna) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ ఉత్సవ్ (Vijayawada Utsav)పై ప్రధాన ప్రతిపక్షం వైసీపీ (YCP) చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని వైసీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న (Buddha Venkanna) అన్నారు. ఇవాళ ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ‘విజయవాడ ఉత్సవ్’ను అడ్డుకునేందుకు దేవినేని అవినాశ్, వెల్లంపల్లి శ్రీనివాస్, పేర్ని నాని వరుసగా విమర్శలకు దిగుతున్నారని ఫైర్ అయ్యారు. రాబోయే రోజుల్లో ఒక్కొక్కరి జాతకాలు రెడ్ బుక్ నుంచి బయటకు రాబోతున్నాయని వార్నింగ్ ఇచ్చారు. ఉత్సవాల నిర్వహణ తర్వాత భూములను దేవదాయ శాఖలకు అప్పజెపుతామని అన్నారు. మచిలీపట్నం దేవాదాయ భూముల దోపిడీపై ముందు పేర్ని నాని (Perni Nani) సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కాగా, విజయవాడ గొల్లపూడిలోని గొడుగుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి (Sri Venkateshwara Swamy Temple) ఆలయానికి చెందిన 39.99 ఎకరాల ప్రధాన భూములను కూటమి సర్కార్ లీజు పేరుతో ఆక్రమించుకోవడానికి సిద్ధమవుతుందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ఇందులో టీడీపీ నేతలు కూడా ఉన్నారని బాంబు పేల్చారు. ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనల్లో 5 ఎకరాలను గోల్ఫ్ ప్రాక్టీస్ రేంజ్‌కు, మరో 34.99 ఎకరాలను విజయవాడ ఉత్సవ్ పేరుతో శాశ్వత ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు కేటాయించాలని నిర్ణయించారని తెలిపారు. వాస్తవానికి ఇది పర్యాటక ప్రోత్సాహం, ఎగ్జిబిషన్ అనే నెపంతో 36.89 ఎకరాల దేవాలయ భూమిని స్వాధీనం చేసుకునే పన్నాగం అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.






