- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
YCP: ర్యాలీకి అనుమతి ఇవ్వండి.. ఏపీ డీజీపీకి వైసీపీ లేఖ
ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ డీజీపీకి వైసీపీ పార్టీ లేఖ రాసింది. కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి సంబంధించి, వాహనాల ర్యాలీకి అనుమతివ్వాలని డీజీపీకి లేఖలో విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి డీజీపీకి రిక్వెస్ట్ చేశారు. ర్యాలీ నిర్వహణపై జిల్లాల ఎస్పీలకు అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని తన లేఖలో కోరారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో సేకరించిన కోటి సంతకాల పత్రాలు ఈ నెల 10న జిల్లా కేంద్రాలకు చేరాయని, వీటిని డిసెంబర్ 15న తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయానికి తీసుకురావాల్సి ఉందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లికి వాహనాల ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వాహనాల ర్యాలీలు, సంతకాల పత్రాల రవాణా నిరవధికంగా సాగేందుకు అనుమతి అవసరమని, అందుకే జిల్లాల ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని లేఖలో కోరారు.






