వైఎస్ జగన్ తెనాలి పర్యటన.. పోలీసుల వాహనం పై వైసీపీ కార్యకర్త డాన్స్‌

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-03 12:50:15  IST  )

ఏపీ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి.

వైఎస్ జగన్ తెనాలి పర్యటన.. పోలీసుల వాహనం పై వైసీపీ కార్యకర్త డాన్స్‌
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ(మంగళవారం) తెనాలి పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ జగన్ తెనాలి పర్యటన హట్ టాపిక్‌గా మారింది. ముగ్గురు కుర్రాళ్లను పోలీసులు కొట్టిన నేపథ్యంలో.. బాధితుల కుంటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించడానికి తెనాలికి వెళ్లారు. ఈ పర్యటనపై కూటమి నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. తాజాగా మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మాజీ సీఎం జగన్ తెనాలి పర్యటనలో ఓ వైసీపీ కార్యకర్త రెచ్చిపోయాడు. ఈ క్రమంలో వైఎస్ జగన్ అక్కడికి వస్తున్న నేపథ్యంలో భారీగా జనం రావడంతో పోలీసులు వెళ్లారు. ఈ తరుణంలో ఒక వైసీపీ కార్యకర్త ఏకంగా పోలీస్ వాహనంపై ఎక్కి ‘‘జై జగన్ జై జగన్’’అంటూ నినాదాలు చేశారు.

మిగతా వైసీపీ కార్యకర్తలు వద్దని చెబుతున్నా కూడా అతను వినలేదు. పోలీస్ వాహనం ఎక్కి చిందులు వేశాడు. మాజీ సీఎం జగన్‌కు అభివాదం చేస్తూ ఊగిపోయాడు. దీంతో రౌడీమూకలను వైఎస్ జగన్ ప్రోత్సహించేలా మాట్లాడడం.. వైసీపీ కార్యకర్తలు రెచ్చి పోయేందుకు కారణం అవుతుందని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్‌గా మారింది.

Next Story